English : అమెరికా అధికారిక భాషగా ఇంగ్లిష్!

అమెరికా అధికార భాషగా ఇంగ్లిష్ (English)ను నిర్ణయిస్తూ కార్యనిర్వాహక దేశాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంతకం చేయనున్నారని శ్వేతసౌధం (White House) వర్గాలు వెల్లడిరచాయి. ఈ పరిణామం దేశంలో ఐక్యతను ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో సమర్థతను నెలకొల్పుతుంది. పౌరుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు మార్గాన్ని ఏర్పరస్తుంది అని శ్వేతసౌధం వర్గాలు పేర్కొన్నాయి. తాజా ఆదేశాలు ఫెడరల్ ప్రభుత్వ నిధులతో నడిచే ప్రభుత్వ కార్యాలయాలు (Government offices), సంస్థలకు తమ సేవలను, పత్రాలను ఇంగ్లిషే తర భాషల్లో కొనసాగించాలా, వద్దా అని ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తాయి.