Donald Trump :మూడో పర్యాయంపై డొనాల్డ్ ట్రంప్ కన్ను

అమెరికా రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి అయిన సరే రెండుసార్లకు మించి దేశాధ్యక్ష పదవిని నిర్వహించడానికి వీల్లేదు. దీన్ని మార్చేసి మూడుసార్లు అధ్యక్ష పదవికి ఎన్నికయ్యేలా రాజ్యాంగాన్ని సవరించాలంటూ పాలన రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్ (పార్లమెంటు) సభ్యుడు యాండీ ఓగిల్స్ (Andy Ogilvy ) దిగువ సభలో సంయుక్త తీర్మానం ప్రవేశపెట్టారు. ఇది ఆమోదం పొందితే డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మూడుసార్లు అధ్యక్ష పదవికి ఎన్నిక కావడానికి వీలు కలుగుతుంది. గడిచిన నాలుగేళ్ల జో బైడెన్ (Joe Biden) పాలనలో అమెరికా వినాశకర ఫలితాలను చవిచూసిందని, ట్రంప్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పరిస్థితిని చక్కదిద్ది అమెరికాను బలోపేతం చేస్తున్నారని ఓగిల్స్ ఉద్ఘాటించారు. ట్రంప్ మూడోసారి అధ్యక్షుడు కావాలంటే 22వ రాజ్యాంగ సవరణను మర్చాలి. దానికి అమెరికా కాంగ్రెస్‌తోపాటు రాష్ట్రాల ఆమోదం పొందడం కష్టమే. అమెరికా చరిత్రలో ఫ్రాంక్లిన్ రూజ్ వెల్ట్ (Franklin Roosevelt ) ఒక్కరే నాలుగుసార్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తరవాత ఇటువంటిది జరగకుండా నివారించడానికి 1951లో 22వ రాజ్యాంగ సవరణ తెచ్చారు.