ఆమె బైడెన్‌కు బీమా పాలసీ లాంటిది : ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ట్రంప్ విమర్శలు పదునెక్కుతున్నాయి. తాజాగా ఆయన అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ను లక్ష్యంగా చేసుకొని తీవ్ర వ్యాఖ్యాలు చేశారు. ఆమెను జో బైడెన్‌కు బీమా పాలసీగా అభివర్ణించారు. ఇటీవల అధ్యక్ష అభ్యర్థిత్వ మార్పిడిపై డెమోక్రటిక్ పార్టీలో చర్చ మొదలైన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జూన్ 27వ తేదీన జరిగిన చర్చా కార్యక్రమంలో జో బైడెన్ ప్రదర్శనపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా ట్రంప్ మాట్లాడుతూ వంకర బుద్ధి జో బైడెన్‌ను ఓ విషయంలో మెచ్చుకోవచ్చు. కమలా హ్యారిస్‌ను తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసుకోవడం అతడు జీవితంలో తీసుకొన్న అద్భుతమైన నిర్ణయం. అదే అతడికి బెస్ట్ ఇన్స్యూరెన్స్ పాలసీ కావచ్చు. కనీసం సగం సమర్థుడినైనా ఎంపిక చేసుకొని ఉంటే, కొన్నేళ్ల క్రితమే బైడెన్‌ను వారు ఆఫీసు నుంచి సాగనంపేవారు. కానీ ఇప్పుడు కమలా ఆ స్థానంలో ఉండటంతో ఇక ఎవరూ పంపలేరు అంటూ ఎద్దేవా చేశారు.






