Dhol Band :ట్రంప్ ప్రమాణ స్వీకారంలో.. భారతీయ అమెరికన్ ఢోల్ బ్యాండ్ మోత
అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రదర్శనకు భారతీయ అమెరికన్ ఢోల్ బ్యాండ్ (Dhol Band )కు ఆహ్వానం అందింది. అగ్రరాజ్యం 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald trump )జనవరి 20న ప్రమాణం చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్(Capitol Hill) నుంచి వైట్‌హౌస్ వరకు జరగనున్న పరేడ్‌లో ఈ ఢోల్ బ్యాండ్ ప్రదర్శన ఇవ్వనున్నట్లు తెలిసింది. టెక్సాస్ (Texas )నుంచి పని చేసే శివం ఢోల్ తాషా పాఠక్ తమ దరువులతో ప్రపంచం ముందు భారతీయ సంప్రదాయ సంగీత విశిష్టతను చాటనుంది.






