దేవుడు దిగి వచ్చిన చెబితే… నేను వెళ్లిపోతా
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన డిబేట్ సమయంలో అస్వస్థతగా ఉండటంతోనే తడబడ్డానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. అధ్యక్ష పదవి రేసు నుంచి తనను దేవుడు మాత్రమే తొలగించగలడని పేర్కొన్నారు. నవంబరు 5న జరిగే ఎన్నికల్లో విజయం ఖాయమన్న ధీమా వ్యక్తం చేశారు. జూన్ 27న ట్రంప్ తో జరిగిన డిబేట్లో బైడెన్ తడబడటంతో అధ్యక్ష పదవి రేసు నుంచి వైదొలగాలని సొంత పార్టీ నేతలే డిమాండ్ చేస్తూన్నారంటూ వార్తలు వెలువడ్డాయి. వీటిని బైడెన్ తోసిపుచ్చారు. ప్రధాన డెమోక్రటిక్ పార్టీ నాయకులు ఎవరూ వైదొలగమని చెప్పలేదన్నారు. దేవుడు పై నుంచి వచ్చి జో నువ్వు రేసు నుంచి వెళ్లిపో అని అడిగితే తాను రేసు నుంచి వెళ్లిపోతానన్నారు. డిబెట్లో జరిగిన తప్పిదాలను బైడెన్ అంగీకరించారు. తనకు అస్వస్థతగా ఉన్నందునే చర్చలో సరిగా స్పందించలేదన్నారు.






