Biden: దాతలకు బైడెన్, హారిస్ కృతజ్ఞతలు
ఎన్నికల ఓటమి తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Biden), ఉపాధ్యక్షురాలు హారిస్ (Harris) తొలిసారిగా ఒకే చోట కలిసి కనిపించారు. డెమోక్రటిక్ నేషనల్ కమిటీ నిర్వహించిన హాలిడే పార్టీ (Holiday party) లో వారిద్దరూ వేదికను పంచుకున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచార నిమిత్తం 200 కోట్ల డాలర్లకు పైగా విరాళాలిచ్చిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. డెమొక్రాట్లు విలువల కోసం పోరాటం సాగించాలి. మన స్ఫూర్తి ఓడలేదు. మనం ఓడిపోలేదు. బలంగా ఉన్నాం. దేనికోసం పోరాడుతున్నామో మనకు స్పష్టత ఉంది అని అతిథులతో బైడెన్, హారిస్ అన్నారు. కింద పడితే కచ్చితంగా లేవాల్సిందే. ఎంత వేగంగా లేస్తారనేదే వ్యక్తికైనా, పార్టీకైనా కొలమానమని మా నాన్న చెప్పేవారు అని బైడెన్ అన్నారు. నవంబర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కు గట్టి పోటీ ఇచ్చారని భావించిన హారిస్ చివరికి ఆయన చేతిలో భారీ తేడాతో ఓడటం తెలిసిందే.






