Washington: వీడ్కోలు కాదు మిత్రమా.. విరామం మాత్రమే.. బైడన్ పొలిటికల్ హింట్….

అమెరికా అధ్యక్షుడి పదవీ బాధ్యతల నుంచి తప్పుకున్న జో బైడెన్(Joe Biden) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను వీడింది కేవలం కార్యాలయాన్నే, పోరాటాన్ని కాదు అన్నారు. అంతేకాదు.. ఈరోజు ప్రారంభోపన్యాసం విన్నాం.. మనం ఇంకా చేయాల్సింది చాలా ఉందని వెల్లడించారు. తాను రాజకీయాల నుంచి ఇప్పుడే తప్పుకోను.. ప్రజా జీవితంలో కొనసాగుతానని స్పష్టం చేశారు. ఆ తర్వాత జో బైడెన్ దంపతులు హెలికాఫ్టర్ ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
సాాదారణంగా అమెరికా అధ్యక్షులుగా పని చేసిన వారు పదవి నుంచి వైదొలగిన తర్వాత ప్రజా జీవితానికి దూరమైపోతుంటారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం .. ఏనాయకుడైనా రెండుసార్లు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత ప్రజాజీవితానికి దూరంగా ఉంటారు. మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, ఒబామా.. ఇలానే ప్రజాజీవితానికి దూరమయ్యారు. అయితే ట్రంప్ మాత్రం తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటానని స్పష్టం చేశారు. అంతేకాదు..ప్రభుత్వ నిర్ణయాలపై పోరాడుతుంటానన్నారు.
తాను పోటీలో ఉన్నట్లైతే.. కచ్చితంగా ట్రంప్ ను ఓడించి ఉండేవాడినని ఇప్పటికే బైడన్ స్పష్టం చేశారు కూడా. అంటే తనను తప్పించడం ద్వారా పార్టీ ఓరకంగా తప్పుడు నిర్ణయం తీసుకుందని బైడెన్ పరోక్షంగా కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. రెండోసారి తాను అమెరికా అధ్యక్షుడిగా అవ్వాలని బైడన్ బలంగా కోరుకుంటున్నట్లు అర్థమవుతోంది. అంతేకాదు.. తనకు ఈసారి ట్రంప్ పోటీగా ఉండే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ట్రంప్ రెండోటర్మ్ అధికారం సాధించారు కూడా.
ప్రస్తుత అధికార పార్టీ గ్రాండ్ ఓల్డ్ పార్టీ (GOP).. వచ్చేసారి కొత్త అభ్యర్థితో బరిలోకి దిగాల్సి ఉంటుంది. అంటే… అనుభవసాలి అయిన తనకు…ఈసారి మంచి ఛాన్సు ఉంటుందన్న ఉద్దేశం కూడా బైడెన్ లో ఉన్నట్లు అనిపిస్తోంది. ఈ పరిణామాలతో మళ్లీ ఛాన్స్ కోసం బైడెన్ ఎదురుచూస్తున్నారని చెప్పొచ్చు. ట్రంప్ సాదారణంగా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటుంటారు. కాబట్టి.. అవికూడా తనకు కలిసివస్తాయన్నది బైడెన్ ఉద్దేశంగా కనిపిస్తోంది.