రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్
ఈ ఏడాది నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్, డెమోక్రటిక్లు తలపడనున్నాయి. ఈ తరుణంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ ఖారారు కాగా..వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధిగా ఒహాయో రిపబ్లికన్ సెనేటర్, తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్ ఎంపికయ్యారు. అమెరికాలో ట్రంప్ తమ రిపబ్లికన్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా సెనేటర్ జేడీ వాన్స్ పేరు ప్రకటించటంతో భారత సంతతికి చెందిన న్యాయవాది, ఆయన సతీమణి ఉషా చిలుకూరి వార్తల్లో నిలిచారు. నవంబర్ 5న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, వాన్స్ గెలిస్తే.. తొలి ఇండో-అమెరికన్ ద్వితీయ మహిళగా ఆమె రికార్డులకు ఎక్కనున్నారు. అమెరికాకు వలస వెళ్లిన తెలుగు కుటుంబానికి చెందిన ఉషా.. శాంటియాగో సబర్బన్ లో పుట్టి పెరిగారు. భర్త జేడీ వాన్స్ విజయ ప్రస్థానంలో ఆమె కీలక పాత్ర పోషించారు.






