Illegal immigrants :500 మందికి పైగా అక్రమ వలసదారుల అరెస్ట్

అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వచ్చీ రాగానే అక్రమ వలసదారుల (Illegal immigrants)పై ఉక్కుపాదం మోపారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించడంతో పాటు దొంగతనాలకు, హింసకు పాల్పడే వారిని నిర్బంధించే బిల్లుకు ఇప్పటికే అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రంప్ (trump) ఆదేశాల మేరకు అమెరికా వ్యాప్తంగా 500 మందికి పైగా అక్రమ వలసదారులను పోలీసులు అరెస్టు చేశారు. వందల మందిని దేశం నుంచి పంపించేశారు. ఈ వివరాలను శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ (Caroline Leavitt) వెల్లడిరచారు. ట్రంప్ యంత్రాంగం ఇప్పటివరకు 538 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసింది. వీరంతా ఉగ్రవాదం, మాదకద్రవ్యాల రవాణా, లైంగిక నేరాల వంటి కేసుల్లో నిందితులుగా ఉన్నవారే. ఇక, అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతోంది. సైనిక విమానాల్లో (Military aircraft) వందల మంది అక్రమ వలసదారులను దేశం నుంచి బయటకు పంపించేశాం. ఎన్నికల్లో ట్రంప్ ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నాం అని కరోలిన్ తెలిపారు.