ఈ సదస్సు సంపూర్ణ విజయం : అమెరికా
భారత్ అధ్యక్షతన జీ20 శిఖరాగ్ర సదస్సు అట్టహాసంగా జరిగింది. ఇది సంపూర్ణ విజయం సాధించిందంటూ అమెరికా స్పందించింది. ఈ సదస్సు విజయవంతమైందా? అని యూఎస్ విదేశాంగ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ప్రశ్నించగా ఈ మేరకు బదులిచ్చారు. ఈ సదస్సు సంపూర్ణ విజయం సాధించిందని మేం నమ్ముతున్నాం. జీ20 ఒక పెద్ద కూటమి. దానిలో రష్యా కూడా సభ్యదేశాలే అని అన్నారు. అలాగే సదస్సులో భాగంగా రష్యా పేరు ప్రస్తావించకుండా ఢిల్లీ డిక్లరేషన్ జారీ చేయడంపై స్పందిస్తూ ఈ కూటమిలో విభిన్న అభిప్రాయాలు కలిగిన సభ్య దేశాలున్నాయి. అదే సమయంలో ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవించాలని పిలుపునిస్తూ ఈ కూటమి ఒక ప్రకటన జారీ చేయగలిగింది. ఉక్రెయిన్పై రష్యా జరుపుతోన్న దాడి నేపథ్యంలో ఇది చాల ముఖ్యమైన ప్రకటన అని మేం భావిస్తున్నాం అని మిల్లర్ అన్నారు.






