Joe Biden :బైడెన్ ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్

అనవసర ఖర్చులు తగ్గిస్తానంటూ ముందునుంచి చెబుతున్న అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దానికి తగ్గట్టుగానే చర్యలు తీసుకుంటున్నారు. జో బైడెన్ (Joe Biden) హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలను నిలిపేస్తున్నారు. ఈ క్రమంలో దుబారా ఖర్చులను అరికడతామంటూ ఎలాన్ మస్క్ (Elon Musk) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఏఫీషియెన్సీ (డోజ్) గాజా (Gaza)లో కండోమ్స్ పంపిణీకి బైడెన్ (Biden) ప్రభుత్వం 50 మిలియన్ డాలర్లను కేటాయించినట్లు గుర్తించింది. ఈ విషయాన్ని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ వెల్లడిరచారు. ఈ విషయం తమ దృష్టికి రాగానే గత ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపివేశామన్నారు.