మళ్లీ డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ ల మధ్యే పోటీ ?
త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా రేసులో మాజీ అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రథమ స్థానంలో ఉన్నాయి. ఓ సంస్థ నిర్వహించిన పోల్స్‌లో ఆయనకు 47 శాతం మంది మద్దతుగా నిలిచినట్టు స్పష్టం అయింది. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెశాంటీస్ కన్నా 19 శాతం ఓట్లు ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. ఏడు రోజుల పాటు జరిగిన పోల్ సర్వే పూర్తి అయింది. రిపబ్లికన్స్‌లో వివేక్ రామస్వామికి 9 శాతం ఓట్లు, మాజీ ఉపాద్యక్షుడు మైక్ పెన్స్‌కు 7 శాతం ఓట్లు వచ్చినట్లు సర్వే వెల్లడిరచింది. రామస్వామి బయెటెక్ కంపెనీ మాజీ అధినేత, ఆయనకు జూన్‌లో 3 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆయన తన ప్రచారానికి 15 మిలియన్ డాలర్లను ఖర్చు చేశారు. ఆన్లైన్లో దేశవ్యాప్తంగా 4,414 మంది వయోజనుల నుంచి అభిప్రాయాలను సేకరించింది.
వచ్చే నవంబర్‌లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నిక జరగనున్నది. డెమోక్రాటిక్ పార్టీ తరపున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తిరిగి పోటీ చేయనున్నారు. పార్టీలో తిరిగి అభ్యర్థిత్వం పొందడానికి ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆయనకు పెద్ద పోటీ ఉండకపోవచ్చు. బైడెన్ కానీ, ట్రంప్ కానీ, తమ పార్టీల వెలుపల ప్రజల మద్దతు ఉన్న వారు కాదు. బైడెన్ వయసు 80 సంవత్సరాలు. వైట్‌హౌస్‌లో ఉన్నత పదవిని నిర్వహిస్తున్న అతివయోవృద్ధుడు ఆయనే. అయితే 63 శాతం మంది ఆయననే సమర్ధిస్తున్నారు. 37 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు. ఇండిపెండెంట్లలో 31 శాతం ట్రంప్ కీ, 32 శాతం బైడెన్‌కి మద్దతు పలుకుతున్నారు. వయోభారం పైన పడినప్పటికీ బైడెన్ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్ధిత్వం రేసులో ముందునున్నారు.






