తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అలరించిన శోభారాజు మరియు శిష్యుల గానామృతం
తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ శోభారాజు గారు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున తిరుమల ఆస్థాన మండపంలో వారి శిష్యులతో కలిసి స్వామి వారికి భక్తితో సంకీర్తనాలాపన చేసారు. గాత్రం పై శోభారాజు శిష్యులు సాంథీప్, అభిరామ్, మానస్ పటేల్, జయశ్రీ, శ్రీయ, తేజస్విని, సువర్ణ, అక్షయ “గణరాజ, గుణరాజ, విష్ణుడోక్కడే విశ్వాత్మకుడు, కంటి అఖిలాండకోటి అంటూ ఉర్రూతలూగిస్తూ, గోవిందా శ్రిత గోకుల బృందా, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు” అని ఆ తిరుమల బ్రహ్మాండ నాయకునికి తాళ్ళపాక అన్నమాచార్యుల వారు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పై రచించిన సంకీర్తనలను భక్తితో గానం చేశారు. వీరికి కీబోర్డు కళ్యాణ్ , తబలా పాండు వాయిద్య సహకారం అందించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థాన కార్యక్రమ అధికారులు డా శోభారాజు మరియు శిష్యులను సత్కరించారు.









