అమెరికాలో భారతీయుల హత్యలపై ఎంపీల ఆందోళన
అమెరికాలో తెలుగు మహిళ శశికళ, ఆమె ఏడేళ్ల కుమారుడు అనీష్ సాయి దారుణ హత్యకు గురైన ఘటనపై భారత ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభలో శూన్యగంట సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ టి.సుబ్బారామిరెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు. రెండు వారాల క్రితమే అగ్ర రాజ్యంలో జరిగిన జాత్యహంకార దాడుల్లో ఇద్దరు భారతీయులు బలయ్యారని, తాజాగా మరో ఇద్దరు హత్యకు గురవ్వడం తీవ్రమైన అంశమని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లాలని ప్రధాని మోదీకి సూచించారు. రాజ్యసభ డిప్యుటీ చైర్మన్ కూడా ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఇటు లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు. తాజా ఘటన కూడా జాతివివక్షకు సంబంధించిందేనని, ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటినుంచే ఈ తరహా దాడులు పెరిగాయని అన్నారు.













