ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలి : ఉపరాష్ట్రపతి
చట్టసభ్యుల అనైతికంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పుడుతున్నారని, ఈ రోత ప్రక్రియకు ముగింపు పలకాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని కేంద్రానికి సూచించారు. రాజ్యసభలో డీఎంకే సభ్యుడు పి. విల్సన్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. సభ చైర్మన్ వెంకయ్యనాయుడు కలగజేసుకుని, పార్టీ ఫిరాయింపు అన్నది నీతిమాలిన, రోత చర్య. దీన్ని అరికట్టేందుకు పార్టీలకు అతీతంగా అందరూ ముందుకొచ్చి ప్రత్యామ్నాయాన్ని సూచించాలి. ఇలాంటి అంశాల్లో ప్రీ సైడింగ్ అధికారులు, కోర్టులు తదితర వ్యవస్థల వద్ద సమయం పడుతోంది అని అన్నారు.













