పార్టీలు మీటింగ్లు పెట్టాలంటే మూడు ‘బి’ లు : ఉపరాష్ట్రపతి
ఒకే సారి ఎన్నికలు జరిగితే అభివృద్ధికి ఆటంకం ఉండదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. మనీ పవర్ ఇన్ ఎలక్షన్స్పై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఒకే సారి ఎన్నికలు జరిగితే అభివృద్ధికి ఆటంకం ఉండదని పేర్కొన్నారు. ఎన్నికల ఖర్చు ప్రభుత్వమే ఇవ్వాలనేది సరికాదన్నారు. వాజపేయి వంటి మహనీయులు సభలకు వెళ్తే సొంత ఖర్చుతో వెళ్లేవాళ్లమని గుర్తు చేశారు. ఇప్పుడు పార్టీలు మీటింగ్లు పెట్టాలంటే మూడు బి లు పాటిస్తున్నాయన్నారు. మూడు బి లు అంటే బీరు, బిర్యానీ, బేటా అని చెప్పుకొచ్చారు.













