అయోధ్యకు ఆదిత్యనాథ్!
యూపీలోని వివాదాస్పద రామమందిర ప్రాంతాన్ని సందర్శించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించుకున్నారు. ఈ నెల 27న ఆ ప్రాంతంలో పర్యటించిక్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించాలని సీఎం నిర్ణయించారని అధికార వర్గాలు తెలిపాయి. ఈమేరకు ఫైజాబాద్ జిల్లా అధికారులకు సీఎం పర్యటన షెడ్యూల్అందినట్టు తెలిసింది. పర్యటనలో రామ్ జన్మభూమిన్యాస్ ట్రస్ట్‌ను కూడా సందర్శించి చర్చలు జరపనున్నారు.







