అమెరికా తన నిర్ణయంపై పునరాలోచించాలి
పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ప్రకటన భారత్ లాంటి దేశాలకు, అంతర్జాతీయ సమాజానికి దిగ్భ్రాంతి కలిగించిందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. రాష్ట్ర విపత్తు స్పందన దళాల (ఎస్డీఆర్ఎఫ్ల) సామర్థ్యం పెంపుపై రెండు రోజుల జాతీయ సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్నాంథ్ సింగ్ మాట్లాడుతూ అంతర్జాతీయ సమాజమంతా ఒక్కటి కాదు, అమెరికా అన్నింటి కన్నా అమెరికా ప్రయోజనాలే అత్యంత ప్రధానం అనే సందేశం ఆ ప్రకటనతో వెలువడిందని వ్యాఖ్యానించారు. అమెరికా తన నిర్ణయంపై కచ్చితంగా పునరాలోస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడుకునేందుకు అంతర్జాతీయ సమాజం కలిసికల్టుగా సాగాల్సి ఉందన్నారు.













