270 మంది భారతీయులను డిపోర్ట్ చేయనున్న అమెరికా
అమెరికాలో సుమారు 270 మంది భారతీయులు అక్రమంగా ఉంటున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాజాగా ఓ జాబితాను విడుదల చేసింది. వాళ్లందర్నీ డిపోర్ట్ చేసేందుకు అగ్రరాజ్యం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. అక్రమంగా ఉంటున్న వాళ్లను తిరిగి స్వదేశం పంపేందుకు అమెరికా చర్యలు చేపట్టిందన్న విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ లోక్సభలో తెలిపారు. డిపోర్టేషన్ జాబితాలో ఉన్న భారతీయుల వివరాలను వెల్లడించాలని అమెరికాను సుష్మా కోరారు. డిపోర్ట్ లిస్టులో ఉన్న పేర్లును పరిశీలించిన తర్వాతే ఆ అంశాన్ని సమగ్రంగా వెల్లడించే అవకాశం ఉంటుందన్నారు.













