శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభం
కర్నూలు జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణంలో ఈవో భారత్ గుప్తా, అర్చకులు, వేదపండితులు యాగశాల ప్రవేశం చేశారు. విఘ్నేశ్వరపూజ, శివసంకల్పం, స్వస్తి పుణ్యాహవాచనం, చండీశ్వరపూజ తదితర క్రతువులు నిర్వహించి ఉత్సవాలకు అంకురార్పణ గావించారు. ఈ సందర్భంగా విశేషసంఖ్యలో తరలివచ్చిన భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకొన్నారు.







