బండి సంజయ్, రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిల ఫోన్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలకు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ అంశంపై కలిసి పోరాడదామని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఇందుకోసం ఉమ్మడి కార్యాచరణ సిద్దం చేద్దామని, ప్రగతి భవన్కు మార్చ్ పిలుపునిద్దామని సూచించారు. కేసీఆర్ మెడలు వంచాలి అంటే ప్రతిపక్షాలు ఏకం కావాలి. కలిసి పోరాటం చేయకపోతే ప్రతిపక్షాలను తెలంగాణలో బతకనివ్వరు అని షర్మిల అన్నారు. ఉమ్మడి పోరాటం చేసేందుకు షర్మిలకు బండి సంజయ్ మద్దతు తెలిపి, త్వరలో సమావేశం అవుదామని చెప్పారు. నిరుద్యోగుల విషయంలో ఉమ్మడి పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించారు. దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఏర్పడిరదన్నారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.













