వైఎస్ షర్మిల గుడ్ న్యూస్… జూలై 8న

జూలై 8న వైఎస్‍ఆర్ టిపి ఏర్పాటు చేయబోతున్నట్లు వైఎస్‍ఆర్ అభిమానులకు వైఎస్ షర్మిల గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు వైఎస్ షర్మిల లోటస్ పాండ్ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‍రెడ్డి పుట్టిన రోజు అయిన జులై 8న పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటన చేశారు. పార్టీ ఆవిర్భావానికి కావలసిన అన్ని రకాల ఏర్పాట్లును ఇప్పటికే ప్రారంభించామని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలనను మరోసారి తెలంగాణలో తీసుకురావడమే లక్ష్యంగా తమ పార్టీ ఏర్పడుతుందని షర్మిల బృందం పేర్కొంది.