చందమామ లాంటి పిల్లుల రాలుతున్నా, కేసీఆర్ కు కనిపించదా? వైఎస్ షర్మిల
తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ వైఎస్ షర్మిల హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేపట్టారు. అయితే గురువారం సాయంత్రం 5 గంటల వరకే దీక్ష కొనసాగుతుందని మొదట్లో ప్రకటించారు. తాజాగా… మరో 72 గంటల పాటు కొనసాగుతుందని సంచలన ప్రకటన చేశారు. అయితే పోలీసులు మాత్రం ఒకరోజు మాత్రమే దీక్షకు అనుమతినిచ్చారు. షర్మిల హఠాత్తుగా ప్రకటన చేయడంతో పోలీసులు ఏం స్పందిస్తారన్నది వేచి చూడాలి.
దీక్ష సందర్భంగా కేసీఆర్‌పై ఫైర్
దీక్ష సందర్భంగా వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్‌పై తీవ్రంగా ధ్వజమెత్తారు. నిరుద్యోగులను సీఎం కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని, చందమామ లాంటి పిల్లలు రాలిపోతుంటే కేసీఆర్‌కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. యుతకు న్యాయం జరగాలని, నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించే వరకూ దీక్ష కొనసాగుతూనే ఉంటుందని ప్రకటించారు. ఉద్యోగాలు లేక యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇంత మంది ఆత్మహత్యలు చేసుకున్నా, కేసీఆర్‌లో మాత్రం చలనమే రావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదో చెప్పాలని నిలదీశారు. తెలంగాణ యువతకు తాము అండగా నిలుస్తామని, అన్ని జిల్లాల్లోనూ తన అభిమానులు దీక్షలకు దిగుతారని ఆమె ప్రకటించారు.













