ప్రజలు తిరస్కరించిన ప్రతిసారి.. వారు వ్యవస్థలపై ఆరోపణలు : బండి సంజయ్
ప్రజలు వారిని తిరస్కరించిన ప్రతిసారి వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని ఆరోపించడం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi), ఇండియా కూటమి పార్టీలకు అలవాటుగా మారిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బెంగాల్ (Bengal) నుంచి అస్సాం వరకు, పుదుచ్చేరి నుంచి రాజస్థాన్, త్రిపుర వరకు తీర్పు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇండియా కూటమిలా అబద్ధాలు, కల్పిత కథల్లా కాకుండా, ప్రధాని మోదీ (Modi) నాయకత్వంపై భారత ప్రజలకు నమ్మకం ఉందని పేర్కొన్నారు. ప్రజలు ప్రచార రాజకీయాలకు, పనితీరు రాజకీయాలకు మధ్య తేడాను చూడగలుగుతున్నారు కాబట్టే బీజేపీ- ఎన్డీఏ (BJP-NDA) కూటమి వరుస విజయాలు సాధిస్తున్నాయన్నారు.








