భాగ్యనగర ప్రజలకు కేంద్రం మరో కానుక.. దేశంలోనే తొలిసారిగా

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో భాగ్యనగరంలో పర్యాటానికి సంబంధించిన మరో కొత్త ప్రాజెక్టు ప్రజలకు అంకితం కానుంది. అత్యాధునిక సాంకేతికతతో వాటర్ స్క్రీన్, మ్యూజికల్ ఫౌంటేన్ పై లేజర్ ఆథారిత సౌండ్ అండ్ లైట్ షోను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ లైట్ అండ్ సౌండ్ షోలో ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన కోహినూర్ వజ్రం గురించిన కథ కూడా ఉంటుంది. తెలంగాణ భూముల్లోనే కోహినూర్ వజ్రం లభించిన సంగతి తెలిసిందే. తెలంగాణ నుంచి మొదలైన కోహినూర్ కథ భిన్న సంస్కృతులు, వివిధ ఖండాలను దాటి చేసిన ప్రయాణాన్ని వాటర్ స్క్రీన్‌పై రంగుల రంగుల లేజర్ వెలుతురులో వివరించనున్నారు.