ఆ మూడు రాష్ట్రాల్లో అభివృద్ధి.. మరి తెలంగాణలో
తెలంగాణ ప్రజలు రెండుసార్లు అధికారం ఇచ్చినా, రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబ సభ్యులంతా అధికారాన్ని చేలాయిస్తూన్నారని, అధికారం లేకుండా కేసీఆర్ ఉండలేరని అన్నారు. వాజ్పేయి ప్రభుత్వ హాయంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి జరగుతోందని, మరి తెలంగాణలో అభివృద్ధి ఎందుకు జరగడం లేదు? అని ప్రశ్నించారు.
తెలంగాణ మాత్రం 10 ఏళ్లలో వెనకబడిపోయిందని అన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. బీజేపీ సారథ్యంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం లీకేజీల ప్రభుత్వం అన్నారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కృషి కూడా ఉంది. కేవలం కేసీఆర్ వల్లే తెలంగాణ ఏర్పడలేదు. కేసిఆర్ ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చలేదు. హైదరాబాద్ తప్ప ఎక్కడ అభివృద్ధి జరగలేదు. దేశానికి గుజరాత్ అభివృద్ధి మోడల్. అభివృద్ధి మంత్రంతోనే గుజరాత్లో 27 ఏళ్లుగా గెలుస్తోంది. విభజన సమస్యలు పరిష్కారం కాకపోవడానికి కాంగ్రెస్ తీరే కారణం అని మండిపడ్డారు.













