500 ఏళ్ల కల… మోదీ వల్లే సాధ్యమైంది : కిషన్ రెడ్డి

దేశ భవిష్యత్ కోసం ప్రధానిగా నరేంద్ర మోదీని మరోసారి గెలిపించుకోవాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కోరారు. గోషామహల్ జుమ్మారత్ బజార్‌లో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో 5 క్లస్టర్లుగా 17 నియోజకవర్గాల్లో 5.5 వేల కి.మీ. మేర ఈ యాత్రలు జరుగుతున్నాయని తెలిపారు. బీజేపీకి 2014లో 278 సీట్లు వస్తే, 2019లో 302 సీట్లు వచ్చాయి. ఈసారి 375 సీట్లు రావాలి. దేశ ప్రజలందరి మనసులో మోదీనే ప్రధాని అవ్వాలని ఉంది. కాంగ్రెస్ పాలనలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగింది. ఇప్పుడు ఒక్క రూపాయి అవినీతి లేకుండా మోదీ పాలన సాగిస్తున్నారు. 500 ఏళ్ల కల అయోధ్య రామాలయాన్ని నిర్మించి మాట నిలబెట్టుకున్నాం. ఇది మోదీ వల్లే సాధ్యమైంది. ప్రపంచంలో మన దేశ ప్రతిష్ఠను ఆయన మరింత పెంచారు. అలాంటి నాయకుడు మళ్లీ ప్రధాని కావాలి. అందుకు తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో గెలిపించాలి. ఎంఐఎం పార్టీ ప్రజాస్వామ్యానికి, అభివృద్ధికి వ్యతిరేకంగా పని చేస్తుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో కలుస్తుంది. అసదుద్దీన్‌ను పార్లమెంట్‌కు వెళ్లకుండా అడ్డుకోవాలంటే హైదరాబాద్ నుంచి బీజేపీని గెలిపించాలి అని కోరారు.