పోలీసు వ్యవస్థ పనితీరుకు ఇది నిదర్శనం : కిషన్ రెడ్డి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ అరెస్టుకు కారణాలేంటో చెప్పాలని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌కు ఆయన ఫోన్ చేశారు. కారణాలు చూపకుండా సంజయ్‌ను ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. డీజీపీ సమాధానమిస్తూ కేసు వివరాలు కాసేపటి తర్వాత వెల్లడిస్తామని తెలిపారు. దీంతో డీజీపీపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్‌ను అరెస్టు విషయంలో ఇంత హంగామా జరుగుతున్నా ఏ కేసులో ఆయన్ను అరెస్టు చేశారో తెలియదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో పోలీసు వ్యవస్థ పనితీరుకు ఇది నిదర్శనమన్నారు. ఈ విషయంలో డీజీపీ వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.













