తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్ .. రెండు డీఏలు మంజూరు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల (Government employees)కు తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రెండు డీఏలు మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2024 జనవరి, జులై డీఏలను ప్రభుత్వం విడుదల చేసింది. రెండు డీఏలు కలిపి 6.27 శాతం పెరుగుదల ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అక్టోబర్ వేతనం (October salary) తో కలిపి పెరిగిన డీఏలను చెల్లించనున్నారు. డీఏ బకాయిలు జీపీఎఫ్ ఖాతా (GPF Account)లో జమవుతాయి. సీసీఎస్ ఉద్యోగుల (CCS employees) కు మొదటి డీఏ 33, రెండో డీఏ 27 వాయిదాలతో చెల్లించనున్నారు.








