పెట్టుబడులతో తెలంగాణకు రండి
తెలంగాణలో పరిశ్రమలకు పెద్దపీట వేస్తున్నామని ఈ మేరకు పారిశ్రామికవేత్తలు పెట్టుబడులతో రావాలని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) చైర్మన్ బాలమల్లు పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని ఆదిభట్ట, బుద్వేల్లో దాదాపు 800 ఎకరాల్లో భారీ ఐటీ పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. లండన్ పార్లమెంటులో జరిగిన ఇండియా టెక్నాలజీ సదస్సు- 2017లో ఆయన మాట్లాడారు. పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసిన 15 రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తోందని తెలిపారు. మూడేళ్లలోనే ఐటీ, ఫార్మా, ఆహారశుద్ధి, మౌలిక సదుపాయాల రంగాల్లో తెలంగాణ గణనీయమైన ప్రగతి సాధించిందన్నారు.













