ఎమ్మెల్సీగా గుత్తా ప్రమాణ స్వీకారం
టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ తన చాంబర్లో సుఖేందర్ రెడ్డితో ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రులు ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, పలువురు టీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు గుత్తా కృతజ్ఞతలు తెలిపారు. నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. 2021 జూన్ మూడు వరకు గుత్తా ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు.













