శాంతిభద్రతలు అదుపులో ఉండాలంటే.. సమర్థవంతులకు
రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉండాలంటే సమర్థవంతులకు పోస్టింగ్లు ఇవ్వాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బచావో హైదరాబాద్ పేరుతో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పోలీసు శాఖలో సమర్థులైన వారిని పక్కనపెట్టి సామాజిక కోణాల్లో పోస్టింగ్లు ఇస్తున్నారని ఆరోపించారు. ఒక అధికారి ఏడున్నరేళ్లుగా ఒకేస్థానంలో ఉన్నారన్నారు. కొందమంది ఐపీఎస్లరే గంపగుత్తగా రెండు కంటే ఎక్కువ శాఖలు అప్పగించారని విమర్శించారు. పదోన్నతి పొందిన వాళ్లను కూడా ఖాళీగా కూర్చోబెట్టారని మండిపడ్డారు. మైనర్ బాలికపై అత్యాచార ఘటన వీడియోలు కావాలనే బయపెట్టారు. ఒప్పందంలో భాగంగానే రఘునందన్ రావు వీడియో బయటపెట్టారు. పట్ట పగలు కూడా పిల్లలను ఇంట్లో నుంచి బయటికి పంపే పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందన్నారు. మేధావులు, ప్రజా సంఘాలు, రాజకీయ నాయకుల అభిప్రాయాలను సీఎం కేసీఆర్ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. నలుగురు ఐపీఎస్ల చేతుల్లోనే 15 శాఖలున్నాయి. నిజాయితీగా పనిచేసే ఐపీఎస్ అధికారులను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. రిటైర్డ్ అధికారులకు మళ్లీ పోస్టింగ్లు ఇచ్చి సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. కొంత మంది కేసీఆర్ తొత్తులకే పదవులు ఇస్తున్నారు. సమర్థ అధికారులను పక్కన పెట్టడం దారుణం. వీళ్లంతా సీఎంకు మంచి చేయడానికే పనిచేస్తున్నారు. నచ్చినోళ్లకు నజరానాలు.. నచ్చనోళ్లకు జరిమానాలు. బాలికపై అత్యాచారం కేసులో జోయల్ డేవిస్ స్వాతి ముత్యంలో కమలాసన్ కంటే ఎక్కువ నటించారు అని విమర్శించారు.













