తికాయత్ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీకి టీఆర్ఎస్ బీ పార్టీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై భారత కిసాన్ యూనియన్ ప్రతినిధి తికాయత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ రైతు ఉద్యమానికి మద్దతుగా ఇందిరా పార్క్ వద్ద విపక్ష పార్టీలు మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు తికాయత్ ముఖ్య అతిథఙగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీకి టీఆర్ఎస్ బీ పార్టీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి కొమ్ముకాసే టీఆర్ఎస్ను ఢిల్లీకి పంపొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని తికాయత్ డిమాండ్ చేశారు. తెలంగాణ ధాన్యం కొనుగోలు చేసే వరకు రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రైతు ఉద్యమం ఒక ప్రాంతానిది కాదని, పంటలకు మద్దతు ధర ప్రకటించేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. పంటలకు ఎమ్ఎస్పీ గ్యారంటీ కార్డ్ వచ్చే వరకు పోరాడుతామని హెచ్చరించారు.













