పర్యటకంలో తొలి స్థానం సాధిస్తాం : జూపల్లి

తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జూపల్లి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యటకాభివృద్ధికి సహకరించాలని షెకావత్‌ను కోరినట్లు వెల్లడిరచారు. జాతీయ స్థాయిలో తెలంగాణ టూరిజం తొమ్మిదో స్థానంలో ఉందన్నారు. రాష్ట్ర పర్యటక రంగాన్ని తొలి స్థానానికి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను కేంద్ర మంత్రి షెకావత్‌కు వివరించినట్లు పేర్కొన్నారు. కేంద్రం నుంచి ఆర్థిక సాయం చేస్తామని షెకావత్ హామీ ఇచ్చినట్లు జూపల్లి వెల్లడిరచారు. విదేశీయుల కోసం వీసా ప్రక్రియ సులభతరం చేయాలని కోరినట్లు, గత ప్రభుత్వ తప్పిదాలను సరి చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.