తెలంగాణ టీడీపీ మహానాడు ప్రారంభం
తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహానాడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రారంభమైంది. మహానాడు ప్రాంగణం నాయకులు, కార్యకర్తలతో సందడిగా మారింది. మహానాడు ప్రాంగణంలో పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీ జెండాన్ని ఆవిష్కరించారు. అధ్యక్షులు ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్, మోత్కుపల్లి నరిసింహులు, నామా నాగేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్య, మాజీ ఎమ్మెల్యే సీతక్క తదితరులు మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు. నేటి మహానాడుకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా నేతలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.













