ఈ నెల 28న టీహబ్-2 ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీ హబ్-2ను అత్యున్నత ప్రమాణాలతో, అత్యంత విశాలమైన ప్రాంగణంలో, అత్యాధునిక మౌలిక వసుతులతో నిర్మించిన విషయం తెలిసిందే. రాయదుర్గం నాలెడ్జ్సిటీలో సుమారు 5.82 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దారు. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్-2ను ఈ నెల 28న ప్రారంభిస్తున్నామని టీ హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాస్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2015లో గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో టెక్నాలజీ హబ్ (టీ హబ్)ను ఏర్పాటు చేశారు. గత ఆరేండ్లలో వివిధ కార్యక్రమాల ద్వారా 1,800 స్టార్టప్‌లను టీ హబ్ ప్రోత్సహించింది. సుమారు 600 కంపెనీలతో కలిసి పనిచేసింది. తాజాగా ప్రారంభిస్తున్న టీ హబ్`2లో ఒకేసారి 2వేలకుపైగా స్టార్టప్‌లు తమ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు వీలుగా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామని శ్రీనివారావు వెల్లడిరచారు.













