షిర్డీ సాయి సన్నిధిలో సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు షిర్డీ సాయినాథుని సమాధి మందిరాన్ని దర్శించుకున్నారు. ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రాజ్యసభ సఢ్యుడు సంతోష్ కుమార్, కుమార్తె, ఎంపీ కవిత సహా, కేసీఆర్ కుటుంబ సభ్యులు షిర్డీకి బయల్దేరి వెళ్లారు. మధ్యాహ్నం షిర్డీకి చేరుకున్న వారికి సాయి సంస్థాన్ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ కదం, ఉపజిల్లా అధికారి ధనంజయ్ నికమ్ పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం ముఖ్యమంత్రి దంపతులకు సాయిబాబా విగ్రహాన్ని అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు.













