బాల్యమిత్రుల కోసం కాన్వాయ్ ని ఆపిన సీఎం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన బాల్యమిత్రుల కోసం ఏకంగా తాను ప్రయాణిస్తున్న కాన్వాయ్‌నే ఆపించారు. సిద్దిపేట పర్యటన బయల్దేరిన ముఖ్యమంత్రి ములుగు వద్ద కాసేపు కాన్వాయ్‌ని ఆపి తన చిన్న నాటి స్నేహితులు జహంగీర్, అంజిరెడ్డిలను అప్యాయంగా పలకరించారు. అనంతరం సిద్ధిపేట పర్యటనకు వారిని కూడా తన వాహనంలో తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి నుంచి ఊహించని ఈ స్పందనతో ఆయన స్నేహితులతోపాటు స్థానికులు, అధికారులు ఆశ్చర్యానికి లోనయ్యారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అధికారిక పర్యటనలు, భేటీలతో ఎప్పుడూ బిజీగా ఉండే కేసీఆర్ ఇలా తన బాల్యమిత్రులను మరిచిపోకుండా కేవలం వారికోసమే తన కాన్వాయ్‌ను సైతం ఆపించి పలకరించడం, తనతో పాటు తీసుకెళ్లాడం అనేది నిజంగా గ్రేట్ కదా.













