Bhatti Vikramarka :గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తెలంగాణ : భట్టి విక్రమార్క

దేశ ప్రగతిలో ఐఐటీలది కీలకపాత్ర అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఆస్ట్రేలియా-ఇండియా (Australia-India) క్రిటికల్ మినరల్ రీసెర్చ్ హబ్ వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ఐఐటీ(IIT) హైదరాబాద్ విద్యాసంస్థ కాదు, ఆవిష్కరణలకు కేంద్రబిందువు అని కొనియాడారు. తెలంగాణను గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా మారుస్తామని తెలిపారు. 2030 నాటికి 2 వేల మెగావాట్ల పెట్టుబడులే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. ఫ్లోటింగ్ సోలార్‌పై పెట్టుబడులు పెడతామని తెలిపారు.