తెలంగాణలో 7,646 కేసులు…మరో 53 మంది

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 7,646 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. మరో 53 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 4,35,606 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 3,55,628 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ కాగా, 2,208 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 77,727 కేసులు ఆక్టివ్‍గా ఉన్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‍ఎంసీ పరిధిలో 1,441, మేడ్చల్ 631, రంగారెడ్డి 484, సంగారెడ్డిలో 401, నిజామాబాద్ 330, నల్గొండ 285, సిద్దిపేటలో 289, సూర్యాపేట 283, కరీంనగర్‍లో 274, మహబూబ్‍నగర్ 243, జగిత్యాల 230, ఖమ్మంలో 21, నాగర్‍కర్నూల్ 198, వికారాబాద్‍లో 189 కేసులు నమోదయ్యాయి.