టీ హబ్ 2 ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఇంక్యుబేటర్ గా టీ హబ్ 2
హైదరాబాద్‌లో నిర్మితమవుతున్న ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెక్నాలజీగా పేరు పొందిన ఇంక్యుబేటర్ టీ హబ్ రెండో దశ పనులు దాదాపు పూర్తయ్యాయి. అతి త్వరలో దీనిని ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. 2,000 పైగా స్టార్టప్‌లకు ఇది నిలయం కాబోతున్నది. దేశంలోనే అతి పెద్ద, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్‌గా నిలవనున్నదని, తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టంను మరింత బలోపేతం చేయనున్నదని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ఇటీవల వెల్లడిరచారు. 2015లో గచ్చిబౌలిలో నెలకొల్పిన టీ హబ్ ఇప్పటికే ప్రపంచం దృష్టిని ఆకర్షించగా, టీ హబ్ 2 హైదరాబాద్ ఖ్యాతిని మరింత ఇనుమడిరపజేస్తుందని ప్రభుత్వ, ఐటీ వర్గాలు ఆశిస్తున్నాయి. మంత్రి కేటీఆర్ ఆలోచనల మేరకు టీ హబ్ 2ను తీర్చిదిద్దారు. హైదరాబాద్‌లోని రాయదుర్గంలో 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందుకోసం రూ.276 కోట్లు ఖర్చు చేశారు. 2017 జనవరిలో దీనికి శంకుస్థాపన చేశారు. 2019లోనే నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యంకాగా కరోనా, ఇతర కారణాల వల్ల ఆలస్యమైంది. టెక్నాలజీ ప్రియులతోపాటు, సామాన్యుల ఆలోచనలకు సైతం ఇక్కడ ప్రోత్సాహం లభించనున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్టప్‌ల ఔత్సాహికులు, వారిని ప్రోత్సహించే వెంచర్ క్యాపిటలిస్టులు, ఏంజిల్ ఇన్వెస్టర్లకు ఉపయోగపడునున్నది. ఇక్కడ రూపుదిద్దుకునే ఆవిష్కరణలు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫెసిలిటీ వల్ల స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ కల్చర్‌కు కొత్త ఊపు లభించనున్నది.













