హైదరాబాద్ లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు
తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారికి జరిగే నిత్య, వారసనేవలు, ఉత్సవాలు ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా టీటీడీ ఆయా ప్రాంతాల్లో వైభవోత్సవాలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో వైభవోత్సవాలను జరుపునున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు వైభవోత్సవాల వివరాలను వెల్లడించారు. 10న ఈ ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని వివరించారు. ఐదు రోజుల పాటు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిత్య కైంకర్యాలు నిర్వహిస్తామని తెలిపారు. వారపు సేవల్లో భాగంగా అక్టోబరు 11న వసంతోత్సవం, 12న సహస్ర కలశాభిషేకం, 13న తిరుప్పావడ, 14న నిజపాద దర్శనం, 15న సాయంత్రం 6:30 నుంచి 8:30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం జరుగుతుందని తెలిపారు.













