హైదరాబాద్ లో స్పెషలాఫీసర్ల నియామకం
భారీ వర్షాలు వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల ప్రకారం సమస్యాత్మక ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల పర్యవేక్షణ కోసం 80మంది ప్రత్యేక అధికారులను నియమిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. సర్కిళ్లవారీగా మొత్తం 235ముంపు ప్రాంతాల్లో వీరు సహాయక చర్యలు చేపడుతారని తెలిపారు. మంగళవారం నుంచే విధులు ప్రారంభించాలని కమిషనర్ స్పష్టంచేశారు. ముంపు ప్రాంతాల్లో రెవెన్యూ, వైద్యం, పోలీసు, విద్యుత్, వాటర్‌బోర్డు తదితర అధికారులను సమన్వయం చేసుకుంటూ పనిచేస్తారని పేర్కొన్నారు. వీరు స్థానిక డిప్యూటీ కమిషనర్‌కు రిపోర్ట్ చేస్తారన్నారు













