Supreme Court: వాన్ పిక్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
వాన్ పిక్ ప్రాజెక్ట్ (Vanpic Project) కు సుప్రీంకోర్టు (Supreme Court) లో ఎదురుదెబ్బ తలిగింది. సీబీఐ (CBI) నమోదు చేసిన కేసును కొట్టివేయాలన్న పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నమోదు చేసిన అభియోగాలను సీబీఐ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుందని, దానికి గల కారణాలు చెప్పలేదంటూ వాన్పిక్ యాజమాన్యం తెలంగాణ హైకోర్టు (High Court)లో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ను ఉన్నత న్యాయస్థానంలో కొట్టివేయడంతో వాన్పిక్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ సుందరేశ్ (Justice Sundaresh) నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీనిపై విచారణకు నిరాకరిస్తూ పిటిషన్ను డిస్మస్ చేసింది.













