ముగిసిన రాష్ట్రపతి శీతాకాల విడిది
హైదరాబాద్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడిది ముగిసింది. హకీంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి పయనమైన ఆయనకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్, మంత్రులు, మేయర్ బొంతు రామ్మోహన్లు వీడ్కోలు పలికారు. ప్రతి ఏడాది శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వస్తుంటారు. ఈ నెల 20న నగరానికి చేరుకున్న ఆయన.. 23న మూడు రోజుల పర్యటన కోసం తమిళనాడు వెళ్లారు. మొత్తం 9 రోజుల పాటు దక్షిణాదిలో కోవింద్ పర్యటన కొనసాగింది. దక్షిణ భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల్లో పుదుచ్చేరి, తిరువనంతపురం, చెన్నై, తెలంగాణలో రాష్ట్రపతి పర్యటించారు.













