వచ్చే ఎన్నికల్లో నా అనుచరులంతా పోటీ చేస్తారు
ఇన్నాళ్లుగా బీఆర్ఎస్ పార్టీలో దక్కిన గౌరవమేంటని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీలో భవిష్యత్ లో దక్కబోయే గౌరవమేంటో కూడా ఆలోచించాలన్నారు. గత నాలుగున్నరేళ్లలో ఏం ఇబ్బంది జరిగిందో తెలియంది కాదన్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో అనుచరులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తన వెంట ఉన్న ముఖ్య నేతలంతా పోటీ చేసి తీరతారని తెల్చిచెప్పారు.













