ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు నోటీసు
పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు నోటీసు ఇచ్చారు. శామీర్‌పేటలోని ఈటల నివాసానికి వచ్చిన ఎస్ఐ 160 సీఆర్పీసీ కింద నోటీసు అందజేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు వరంగల్ డీసీపీ ఆఫీసులో హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. హిందీ ప్రశ్నపత్రం లీకేజీకి ముందు రోజే నిందితుడు ప్రశాంత్‌తో కలిసి కుట్ర చేసినట్లు ఆధారాలు లభించడంతోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ను ఆరెస్ట్ చేసినట్లు వరంగల్ కమిషనర్ ఎ.వి.రంగనాథ్ స్పష్టం చేశారు. ప్రశాంత్ ప్రశ్నపత్రాన్ని బండి సంజయ్‌తోపాటు ఈటల రాజేందర్‌కు, ఆయన పీఏలకు కూడా పంపాడు. అనేక మంది బీజేపీ నాయకులకూ లీకేజీ సమాచారం వెళ్లింది. కానీ బండి సంజయ్, ప్రశాంత్‌ల మధ్య చాటింగ్ జరిగింది. గేమ్‌ప్లాన్ ప్రకారం హిందీ పేపర్ లీకేజీపై వైరల్ చేశారు. కమలాపూర్‌లో ముందురోజు తెలుగు బిట్ పేపర్ కూడా బయటికొచ్చినట్లు దర్యాప్తులో తేలింది అని మీడియా సమావేశంలో సీపీ వెల్లడిరచారు. ఈ నేపథ్యంలో ఈటలకు 160 సీఆర్పీసీ కింద నోటీసు అందజేశారు.













