బండి సంజయ్‌కుమార్ కి మోదీ శుభాకాంక్షలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్, హిమచల్‌ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వారు ఆయన వేర్వేరుగా లేఖలు పంపించారు. చేసే పనివల్ల జీవితం కీర్తిమయం, సార్ధకం కావాలని, దేశం కొత్త శిఖరాలను అధిరోహించేలా సంజయ్ అనుభవం తోడ్పడాలని ప్రధాని ఆకాంక్షించారు. సంజయ్ నిండు నూరేళ్లు జీవించి ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సంజయ్ మరిన్ని ఉన్నత పదవులను అలంకరించాలని దత్తాత్రేయ ఆకాక్షించారు. ఈ సందర్భంగా వారికి బండి ధన్యవాదాలు తెలియజేశారు.













