తెలంగాణలో మాదే అధికారం : మోదీ
తెలంగాణలో అధికార మార్పిడి తప్పక జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా బేగంపేట విమానాశ్రయంలో దిగిన ప్రధాని మోదీకి బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత సభలో పాల్గొని మాట్లాడారు. పట్టుదలకు, పౌరుషానికి మారు పేరు తెలంగాణ ప్రజలు అని అన్నారు. తానెప్పుడు రాష్ట్రానికి వచ్చినా అపూర్వ స్వాగతం పలుకుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ కార్యకర్తలు కృషి చేస్తున్నారు. భారతదేశ ఐక్యత కోసం సర్దార్ పటేల్ ఎంతో కృషి చేశారు. ఒక ఆశయం కోసం వేలమంది ప్రాణత్యాగాలు చేశారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరులతో పాటు ఎవరి ఆశయాలు కూడా నెరవేరడం లేదన్నారు. కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయింది. కేవలం ఒక కుటుంబం కోసం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరగలేదన్నారు.
కుటుంబ పార్టీలను తరిమితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ హవా కనిపిస్తోది. ఇక్కడ కూడా అధికారంలోకి వచ్చితీరుతుంది. తెలంగాణ అభివృద్ధి కోసం ఎంత పోరాటమైనా చేస్తాం. యువతతో కలిసి అభివృద్ధి పథంలోకి నడిపిస్తాం. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ సూత్రంతో బీజేపీ పనిచేస్తోందన్నారు. కుటుంబపాలన, అవినీతి వల్ల అభివృద్ధి జరగడం లేదన్నారు. తెలంగాణ ప్రజలు ఎంత సమర్థులో నాకు తెలుసు. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతోంది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా దూసుకెళ్తున్నాం. ఈ 8 ఏళ్ల వేల స్టార్టప్‌లను ప్రోత్సహించాం అని అన్నారు.













