తెలంగాణలో నేటి నుంచి నామినేషన్లు
తెలంగాణ శాసనసభ ఎన్నికల పోరులో తొలి అంకానికి తెరలేస్తోంది. నామినేషన్ల పర్వం ప్రారంభమవుతోంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచారాన్ని ప్రారంభించాయి. ఇక నామినేషన్ల ప్రక్రియకూ శ్రీకారం చుట్టనున్నాయి. ఇది పదో తేదీ వరకు కొనసాగనుంది. ఇప్పటకే ప్రధాన పార్టీల టికెట్ ఖరారైన అభ్యర్థులతో పాటు ఆశావహులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ముహూర్తాల మీద నమ్మకాలున్న వారు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శుక్రవారం తో పాటు ఈ నెల 4, 7, 8, 9, 10 తేదీలలో భారీగా దాఖలయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో మూడో శాసనసభ ఎన్నికల్లో 3.17 కోట్ల మంది ఓటర్లు 119 మంది ఎమ్మెల్యేలను ఎన్నుకోనున్నారు.













